- ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం నాది.
- తెలంగాణ వచ్చాక కూడా పేదలకు న్యాయం జరగలేదు.
- రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది. నా నిజాయితీనే నా బలం.
- నేను నామినేషన్లకు డబ్బులు ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యేలు అయినోళ్లు ఉన్నారు.
- పేదవానికి ఐదు లక్షల ఇల్లు ఇవ్వడానికి 500 రూల్స్ పెడుతున్నారు.
- సగం ఇల్లు కట్టుకున్నాక… ఆటో ఉందనో ట్రాక్టర్ ఉందనో బిల్లులు ఆపేస్తున్నారు.
- ఏపూరి సోమన్న చట్టసభల్లో అడుగుపెడతాడు.
ప్రతిపక్షం మునుగోడు ఆగస్టు 14: హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ప్రముఖ కళాకారుడు ఏపూరి సోమన్న 25 ఏండ్ల పాటల ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిధిగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా నేనెప్పుడూ ప్రజల పక్షమే అని చెప్పారు.ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నైజం నాది.దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సిద్ధం కావాలి.
అందుకు ఏపూరి సోమన్న లాంటి కళాకారులు గజ్జ కట్టాలి నేను రుమాలు చూడతా ప్రజల్లోకి వెళదాం.రేవంత్ రెడ్డి సర్కార్ మంచి చేస్తే మంచంట.. తప్పు చేస్తే తప్పని అంటా.తెలంగాణ వచ్చాక కూడా పేదలకు న్యాయం జరగలేదు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు, కాంగ్రెస్తో సంబంధం లేని వాళ్ళు ఇవ్వాళ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు.
ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద పదవుల్లో ఉంటే బాధ అనిపిస్తుంది.రాష్ట్ర రాజకీయాలను మార్చే శక్తి, శాసించే శక్తి నాకుంది. నా నిజాయితీనే నా బలం.రానున్న కాలంలో నిజాయితీపరులు, యువకులు అసెంబ్లీలో అడుగు పెట్టాలి.
రాష్ట్ర రాజకీయాలు మార్పు దిశగా అడుగులు వేయాలి.తెలంగాణ రాజకీయాలు కూడా తమిళనాడు తరహాలో మారనున్నాయి.నా వెంట ప్రజలు ఉన్నారు. అవినీతి ఎమ్మెల్యేలు డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు, పాచిపోయిన ఎమ్మెల్యేలు నాకు అవసరం లేదు.ఒకసారి గెలవగానే డబ్బు, అధికారం, పదవిపై వ్యామోహం పెరుగుతుంది. గెలిపించిన ప్రజలను గాలికి వదిలేస్తున్నారు.నేను నామినేషన్లకు డబ్బులు ఇస్తే ఎంపీ, ఎమ్మెల్యేలు అయినోళ్లు ఉన్నారు.కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంపీలను, ఎమ్మెల్యేలను గెలిపించిన. ఇప్పుడు వాళ్లను మనం పిలిస్తే వస్తారా… రారు. వాళ్ళు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికే పోతారు.కులం, మతం పేరు చెప్పుకొని పైకెదిగిన తర్వాత వసూలు రాజాలుగా మారిన వ్యక్తులను తరిమికొట్టాలి.
తప్పుడు పనులు చేస్తూ కులాన్ని వాడుకోవడం మంచిది కాదు.ధర్మం, న్యాయం అన్ని కులాలకు ఒకటే ఉంటది.
ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అండగా ఉండాలి కానీ అహంకారం పెంచుకోవద్దు.పదవి అనేది బాధ్యత కానీ కిరీటంగా భావించవద్దు.ఇప్పుడున్న నాయకులు చాలామంది గెలిచే వరకు ఒక తీరుగా గెలిచిన తెల్లారే మరో తీరుగా మారుతున్నారు. అట్లాంటి వాళ్లకు తెల్లారేసరికి పెద్దపెద్ద కార్లు ఎట్లా వస్తున్నాయి.ఉన్నోడేమో 1000 రేట్లు పెరుగుతుండు లేనోడు ఇంకా అక్కడే ఉంటుండు.పైన ఉన్నోళ్లేమో లక్షల కోట్లు దోచుకుంటున్నారు.పేదవానికి ఐదు లక్షల ఇల్లు ఇవ్వడానికి 500 రూల్స్ పెడుతున్నారు.సగం ఇల్లు కట్టుకున్నాక… ఆటో ఉందనో ట్రాక్టర్ ఉందనో బిల్లులు ఆపేస్తున్నారు.దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం.అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, పోరాటం చేస్తా.ఇన్నేళ్లు సహనంతో ఉన్న… ఇక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.కళాకారులు చట్టసభల్లో అడుగు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రం రావడంలో వాళ్ళు కూడా చాలా కీలకం.ఏపూరి సోమన్న ఏదో ఒక నియోజకవర్గ నుంచి చట్టసభల్లో అడుగుపెడతాడు. నేను మాటిస్తే వెనక్కి పోను అని స్పష్టం చేశారు.




































