Trending Now

ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కన్నుమూత..

ప్రతిపక్షం, సినిమా: ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ రిచర్డ్ లూయిస్(76) కన్నుమూశారు. లాస్ ఏంజిల్స్‌లోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ఆయన భార్య జాయిస్ లాపిన్‌స్కీ సోషల్ మీడియాలో ప్రకటించారు. కాగా, 1970-80 లలో లూయిస్ స్టాండప్ కమెడియన్‌గా అలరించారు. ఆ తర్వాత పలు హాలీవుడ్ సినిమాల్లో నటించారు. రాబిన్ హుడ్, స్లెడ్జ్, గేమ్ డే, డ్రంక్స్, వన్స్ అపాన్ ఏ క్రైమ్ వంటి చిత్రాల్లో నటించి నవ్వులు పూయించారు.

Spread the love