గంగుల అవినీతిపై అసెంబ్లీలోనే చర్చకు వచ్చింది
అవినీతి పై విరుచుకుపడాలి
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై బీజేపీ నేతలు ఫైర్
ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, అక్టోబర్ 08: ‘‘ఏయ్ బిడ్డా.. కిసాన్ నగర్ బండి సంజయ్ అడ్డా. అందుకే కిసాన్ నగర్ సహా కరీంనగర్ కార్పొరేషన్ ను బీజేపీకి అప్పగించారు. ఆ విషయం గుర్తుంచుకో’’అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు అన్నారు. కిసాన్ నగర్‌లో రూ.65 కోట్లతో అభివృద్ధి చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే, అక్కడ వేసిన రోడ్లు, ఏర్పాటు చేసిన వీధి దీపాలు, ఇతర మౌలిక వసతులన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్మార్ట్ సిటీ కింద తెచ్చిన నిధులతోనే పూర్తయ్యాయని తెలుసుకోవాలని పునరుద్గాటించారు. 66 కార్పొరేషన్ స్థానాల్లో కేవలం 8 స్థానాలకే బిఆర్ఎస్ పరిమితం కావడమే ఎమ్మెల్యే వైఫల్యానికి నిదర్శనమని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నగరానికి ఏమీ చేయని వ్యక్తి మాటలను కరీంనగర్ ప్రజలు ఇంకెంతమాత్రం నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. గంగుల కమలాకర్ శుద్ద పూస కాదని, అవినీతి అనకొండ అని మండిపడ్డారు. అసెంబ్లీలోనే కమలాకర్ భూకబ్జాలు, అవినీతిపై చర్చించిన విషయాన్ని గుర్తు చేశారు.
గంగుల హయాంలో నిర్మించిన ఐటీ టవర్ లో తొండలు గుడ్లు పెడుతున్నాయని, అక్కడ ఎక్కడ ఎన్ని లక్షల ఉద్యోగులు వచ్చినాయని ప్రశ్నించారు. మానేరు రివర్ ఫ్రంట్ తో ఎలక్షన్ లొ హామీలిస్తే ఎవరికి లాభం జరిగింది కేబుల్ బ్రిడ్జితో ఎవరు లాభం పొందారో ప్రజలు బేరీజు వేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు సాయంత్రం బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కిసాన్ నగర్ నుండి చింతల వరకు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, పార్టీ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావుసహా బీజేపీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులంతా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత సాయిని మల్లేశం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దేశం, ధర్మం మరియు సమాజ శ్రేయస్సు కోసం అంకితభావంతో పనిచేస్తుందని తెలిపారు. బండి సంజయ్ కు కిసాన్ నగర్ ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉందని, బిజెపికి సంబంధించి ఏ కార్యక్రమం లేదా ఎన్నికల ప్రచారం ప్రారంభమైనా ఈ కిసాన్ నగర్ గడ్డ నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కిసాన్ నగర్ ప్రజలకు బండి సంజయ్ పై ఉన్న అభిమానాన్ని, ఆదరణను కాంగ్రెస్ గానీ, బిఆర్ఎస్ గానీ ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. “కిసాన్ నగర్ గడ్డ అంటేనే బండి సంజయ్ అడ్డా” అని వ్యాఖ్యానించారు. ఒకవైపు బిఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో బిజెపిపై లేనిపోని అవాకులు చవాకులు పేలుస్తూ, తప్పుడు నినాదాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా, కిసాన్ నగర్ ప్రజల గుండెల్లో బండి సంజయ్ స్థానం పదిలంగా ఉంటుందని, ప్రజల మద్దతు ఎల్లప్పుడూ బిజెపికే ఉంటుందని స్పష్టం చేశారు.అనంతరం యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ… గత ఐదేళ్లుగా ఎంపీగా, ప్రస్తుతం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ 1, అమృత్ 2, స్మార్ట్ సిటీ, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా వందలాది కోట్ల రూపాయల నిధులను కరీంనగర్‌కు తీసుకువచ్చారని తెలిపారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధిని చూసే నగర ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి 34 స్థానాలు కట్టబెట్టి మేయర్ పీఠాన్ని అందించారని అలాగే ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోనే 55,000 పైచిలుకు భారీ మెజార్టీని ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారనీ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన గత మూడేళ్లుగా కరీంనగర్ ప్రజలను గంగుల కమలాకర్ పూర్తిగా విస్మరించారని, ఇన్ని రోజులు తెరచాటున ఉండి, ఏ పార్టీలో చేరాలో తెలియక, అన్ని తలుపులు మూసుకుపోవడంతో ఇప్పుడు మళ్లీ ప్రజల ముందుకు వచ్చి కండువాల నాటకానికి తెరతీశారని మండిపడ్డారు.
గతంలో లక్షలాది కండువాలు కప్పి మోసం చేసినట్లే, ఇప్పుడు మళ్లీ వాడవాడలా తిరుగుతూ మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.కిసాన్ నగర్‌లో రూ.65 కోట్లతో అభివృద్ధి చేశామని ప్రగల్భాలు పలుకుతున్న ఎమ్మెల్యే, అక్కడ వేసిన రోడ్లు, ఏర్పాటు చేసిన వీధి దీపాలు, ఇతర మౌలిక వసతులన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్ స్మార్ట్ సిటీ కింద తెచ్చిన నిధులతోనే పూర్తయ్యాయని తెలుసుకోవాలని పునరుద్గాటించారు. 66 కార్పొరేషన్ స్థానాల్లో కేవలం 8 స్థానాలకే బిఆర్ఎస్ పరిమితం కావడమే ఎమ్మెల్యే వైఫల్యానికి నిదర్శనమని, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా నగరానికి ఏమీ చేయని వ్యక్తి మాటలను కరీంనగర్ ప్రజలు ఇంకెంతమాత్రం నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. అసెంబ్లీలో కమలాకర్ కు పేరు వచ్చింది అంటే అవినీతిపై విచారణ జరపాలి అని పేరు వచ్చిందే కానీ అభివృద్ధి విషయంలో రాలేదని అన్నారు. మీ హయాంలో జరిగిన ఐటీ టవర్ ఏమైంది ఎక్కడ ఎన్ని లక్షల ఉద్యోగులు వచ్చినాయి మరియు మానే రివర్ ఫ్రంట్ తో ఎలక్షన్ లొ హామీలిస్తే ఎవరికి లాభం జరిగింది కేబుల్ బ్రిడ్జితో ఎవరు లాభం పొందారో ప్రజలు బేరీజు వేస్తున్నారని మండిపడ్డారు. ఒక దశలో స్మార్ట్ సిటీ రాదని చెప్పిన మాట్లాడిన నీవు, ఈరోజు స్మార్ట్ సిటీ తెచ్చిన స్మార్ట్ సిటీ వల్ల అభివృద్ధి జరిగిందని చెప్తే ప్రజలు ఎవరు విశ్వసించరు కమలాకర్ ఇది గుర్తుంచుకో అని ధ్వజమెత్తారు. అభివృద్ధి అంటే స్మార్ట్ సిటీ అని, అది బండి సంజయ్ వల్లనే సాధ్యమైందని ప్రజలందరికీ స్పష్టంగా అర్థమైందిని తెలియజేశారు.





























