*చెడుపై మంచి సాధించిన విజయమే దీపావళి – కరస్పాండెంట్ కోడి వెంకన్న
ప్రతి పక్షం చండూరు నవంబర్ 07 : చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ పాఠశాలలో దీపావళి పండుగను పురస్కరించుకొని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు దీపావళి పండుగ ప్రాముఖ్యతను, విశిష్టతను, పండగ జరుపుకునే కారణాలను ఉపాధ్యాయులు తెలియజేశారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న మాట్లాడుతూ…”దీపావళి పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. చీకటి నుండి వెలుతురులోకి రావడమే దీపావళి సందేశం. కావున మనం కూడా కింది స్థాయి నుండి పై స్థాయికి ఎదగాలని” ఆకాంక్షిస్తూ విద్యార్థులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మా, ప్రిన్సిపాల్ రవికాంత్, వైస్ ప్రిన్సిపాల్ వినయ్, తెలుగు ఉపాధ్యాయుడు రమేష్ మరియు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.






























