[t4b-ticker]

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వావలంబన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదాం: కల్వకుంట్ల కవిత

ప్రతిపక్షం, ఆగస్టు 09: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత ఆదివాసీ సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అడవితో మమేకమై ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుతూ భారతీయ సమాజానికి తమదైన ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందిస్తున్న ఆదివాసీల సేవలను ఆమె కొనియాడారు.

ఆదివాసీ సమాజం ప్రకృతితో సహజీవనం చేస్తూ అడవులు, కొండలు, నదులు, వనరులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తోందని కవిత పేర్కొన్నారు. వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు భారతీయ సమాజానికి గొప్ప వారసత్వమని అన్నారు.

ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వావలంబన కోసం ప్రతి ఒక్కరూ కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ఆదివాసీ సమాజానికి సమాన అవకాశాలు, గౌరవం, హక్కులు దక్కేలా సామాజిక న్యాయం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News