ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు
దూకుడు పెంచిన ఈడీ..
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో ఈడీ మరింత దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది. కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసిన కవితకు ఎదురు దెబ్బ తగిలింది. కవితను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టు చేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అరెన్యూ కోర్టు నిరాకరించింది. కవితను మరింతగా విచారించేందుకు ఈడీ కోర్టులో పిటిషన్ వేయగా, అందుకు కోర్టు కూడా అనుమతిచ్చింది. జైలులో ఉన్న కవితను ఈడీ విచారించనుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ కవితకు మరో షాకిచ్చింది. కాగా, ఇప్పటికే ఈడీ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవిత.. ఈనెల6న తీహార్ జైలులో సీబీఐ విచారించింది. అయితే కవితను రౌస్ అరెన్యూ కోర్టులో హాజరు పర్చే అవకాశం ఉంది. కవితను సీబీఐ 10 రోజుల కస్టడీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని మద్యం లైసెన్సుల్లో అధిక వాటా కోసం ఢిల్లీలోని అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం ఇచ్చిన సౌత్ గ్రూప్‌లో కె కవిత కీలక సభ్యురాలు అని ఆరోపణలు వచ్చాయి. 2021-22 కోసం ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీలో సౌత్ గ్రూప్ ముఖ్యమైన పాత్ర పోషించినట్లు ఈడీ పేర్కొంది. మద్యం కుంభకోణం నిందితుడు విజయ్ నగర్ ఈ గ్రూపు నుంచి రూ.100 కోట్లు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంటి నుంచి అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఏప్రిల్ 4న కేసును విచారించిన కోర్టు తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఆ తర్వాత ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించారు.