Trending Now

‘దంగల్’ నటి జైరా వాసిమ్ తండ్రి కన్నుమూత..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి, అమీర్ ఖాన్ సహనటి జైరా వాసిమ్ తండ్రి జాహిద్ వాసిమ్ మంగళవారం (మే 28) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తాజాగా వెల్లడించింది. జైరా వాసిమ్ తండ్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అమీర్ ఖాన్‌తో అరంగేట్రం చేసిన ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది.

జమ్ము కాశ్మీర్‌లో పుట్టి పెరిగిన జైరా వాసిం.. ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమాలో గీతా ఫొగట్ పాత్రలో బాలనటిగా ఆకట్టుకుంది. తర్వాత ఆమిర్ ఖాన్‌తో ‘సీక్రెట్ సూపర్ స్టార్’ అనే సినిమాలో మరోసారి కలిసి నటించింది. ‘స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలోనూ కీలక పాత్ర పోషించింది.

Spread the love

Related News