ప్రతిపక్షం,సిద్దిపేట టౌన్,జూలై 24: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం సిద్దిపేట పట్టణంలో పలువురు కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.హైదరాబాద్‌లో చికిత్స పొందిన సీనియర్ జర్నలిస్ట్ సంజీవ్ రెడ్డి తండ్రి కాంగ్రెస్ నేత నర్సింహా రెడ్డిని ఇమాంబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ధైర్యంగా ఉండాలని మనోధైర్యాన్ని అందించారు.

















