Trending Now

ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి

ప్రతిపక్షం, సిద్దిపేట, జూన్ 12: తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు విద్యార్థుల విద్యను నిర్లక్ష్యం చేస్తూ కళాశాలలకు చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్ మెంట్ వెంటనే చెల్లించాలని తెలంగాణ యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దోనె అశోక్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గడిచిన మూడు సంవత్సరాల నుండి చెల్లించకపోవడంతో సుమారు 7 వేల కోట్లకు పైన బకాయిలు ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆయా కళాశాలల యాజమాన్యం ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. విద్యార్థిని, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఆ బకాయిలను చెల్లించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే రాష్ట్రంలో నిరుపేదలు ఉన్నత విద్యను అభ్యసించడానికి నిలయాలుగా ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నప్పటికీని వాటి పరిస్థితి కనీస మౌలిక వసతులు లేక ఆగమ్య గోచరంగా ఉన్నాయన్నారు. వసతి గృహాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ఇంకా కొత్తగా వసతి గృహాలను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలు త్వరగా విద్యార్థులకు సమకూర్చి వారి యొక్క బంగారు భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విద్యార్థుల విద్యను అభ్యసించేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టంను తుంగలో తొక్కి విచ్చల విడిగా పుస్తకాలు, డొనేషన్ ల పేరుతో విద్యార్థుల తల్లదండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకోని ఫీజు నియంత్రణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు మల్యాల శేషు కుమార్, ఏల ప్రవీణ్, చెట్టుపల్లి మనోహర్, సున్నం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News