Trending Now

సులబ్ కాంప్లెక్స్‌కి తాళం..

పట్టించుకోని మున్సిపల్ అధికారులు

ప్రతిపక్షం, హుస్నాబాద్, ఏప్రిల్ 5: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మల్లె చెట్టు చౌరస్తా రామవరం రోడ్‌లో ఉన్న సులక్ కాంప్లెక్స్ కు ఇరవై రోజులుగా తాళం వేసారని.. దీంతో మార్కెట్ కు వచ్చే మహిళలు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నాయకులు గాదాసు రాంప్రసాద్, పరయోగుల అనంత స్వామి ఆరోపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శుక్రవారం అంగడి బజార్ కు మాత్రం కోటికీ పైగా ఆదాయం వస్తున్న అంగడికి వచ్చే మహిళలకు ప్రజలకు వ్యాపారస్తులకు మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని కనీసం మల్లె చెట్టు చౌరస్తాలొ ఉన్న సులబ్ కాంప్లెక్స్ ఇరవై రోజులగా తాళం వేసి ఉంచడంతో ప్రతి రోజు ఇక్కడే కూరగాయల మార్కెట్ లొ కూరగాయలు అమ్మే మహిళలు, కొనుగోలు చేయడానికి వచ్చిన మహిళలు ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి సులబ్ కాంప్లెక్స్ తెరిపించాలని బీజేపీ నాయకులు కోరారు.

Spread the love

Related News