రామంతాపూర్‌లో నాసిరకం ఐస్‌క్రీమ్ తయారీ గుట్టురట్టు.. భారీగా ముడి పదార్థాల స్వాధీనం

ప్రతిపక్షం, జూలై 15: హైదరాబాద్‌లోని రామంతాపూర్ ప్రాంతంలో నాసిరకం ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్న కేంద్రంపై ఉప్పల్ ఎస్‌వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. తనిఖీల్లో గడువు ముగిసిన ఫుడ్ కలర్స్, ఫ్లేవర్లు, ఫంగస్ పట్టిన డ్రైఫ్రూట్స్‌తో పాటు లేబుల్ లేని ముడి పదార్థాలను ఉపయోగించి ఐస్‌క్రీమ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు.

దాడిలో భారీ మొత్తంలో నాసిరకం ముడి పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా నిబంధనలను ఉల్లంఘించి ఉత్పత్తులు తయారు చేస్తున్న యూనిట్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News