•61ఏళ్ల వనపర్తి వ్యక్తికి విజయవంతంగా అరుదైన హై-రిస్క్ హార్ట్ బైపాస్ శస్త్రచికిత్స
ప్రతిపక్షం, జూలై 02, వనపర్తి ప్రతినిధి: హైదరాబాద్, మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో
అత్యంత క్లిష్టమైన లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ వ్యాధితో బాధపడుతున్న 60ఏళ్ల వ్యక్తికి అరుదైన బీటింగ్ హార్ట్ బైపాస్ శస్త్రచికిత్స విజయవంతంగా చేసినట్లు మలక్ పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్ డా. వెంగల్ రెడ్డి తెలిపారు.గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలో మలక్ పేట యశోద ఆసుపత్రి వారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.వనపర్తి జిల్లాకు చెందిన 61 ఏళ్ల ఎస్.కృష్ణప్రసాద్‌కు గత ఆరు నెలలుగా ఎడమవైపున ఛాతీ నొప్పితో బాధపడుతున్నాడు.రోగికి నిర్వహించిన పరీక్షల్లో లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసెల్ డిసీజ్, టైప్-2 మధుమేహం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ఇలాంటి గుండె ప్రధాన ధమని సహా పలు రక్తనాళాల్లో తీవ్రమైన అడ్డంకులు ఉన్నట్లు తేలడంతో వెంటనే బైపాస్ శస్త్రచికిత్స అవసరమని వైద్యులు నిర్ణయించారు.అత్యాధునిక గుండె శస్త్రచికిత్సను యశోదా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్ డా. వెంగల్ రెడ్డి ఎస్. ఆధ్వర్యంలో రోగికి ఆఫ్-పంప్ కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ & వాస్క్యులర్ సర్జన్ డా. వెంగల్ రెడ్డి మాట్లాడుతూ…లెఫ్ట్ మెయిన్ కొరోనరీ ఆర్టరీలో తీవ్రమైన అడ్డంకి ఉన్న రోగులు అత్యంత ప్రమాద స్థితిలో ఉంటారని తెలిపారు.ఇలాంటి కేసుల్లో వేగవంతమైన నిర్ధారణ,ఖచ్చితమైన శస్త్రచికిత్స ప్రణాళిక,అత్యాధునిక మౌలిక సదుపాయాలు, నిపుణుల సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు.అత్యాధునిక కార్డియాక్ ఆపరేషన్ థియేటర్లు, ప్రత్యేక కార్డియాక్ ఐసీయూలు, ఆధునిక ఇమేజింగ్ సాంకేతికత,అనుభవజ్ఞులైన కార్డియాలజిస్టులు, కార్డియాక్ సర్జన్లు, క్రిటికల్ కేర్ నిపుణుల సమన్వయంతో అత్యంత క్లిష్ట గుండె వ్యాధులకు కూడా విజయవంతమైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు.ప్రపంచస్థాయి వైద్య ప్రమాణాలతో, రోగి-కేంద్రిత వైద్య సేవలతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం యశోదా ఆసుపత్రుల లక్ష్యమని వారు స్పష్టం చేశారు.మరిన్ని వివరాల కోసం ఎ. వాసుకిరణ్ రెడ్డి – 97057 71230 / 99499 98378 నెంబర్లను సంప్రదించాలని కోరారు.
















