‘iPhone 16’ release: ఐఫోన్ 16 విక్రయాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. వీటి కోసం కొనుగోలుదారులు యాపిల్ స్టోర్‌ల ముందు క్యూ కట్టారు. ముంబయి, ఢిల్లీతో సహా పలు యాపిల్ స్టోర్ల బయట వారు పెద్దఎత్తున బారులు తీరారు. ఇక ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొ మ్యాక్స్.. అనే నాలుగు మోడళ్లను యాపిల్ తీసుకొచ్చింది. అత్యాధునిక టెక్నాలజీతో ఇవి అందుబాటులోనికి వచ్చాయి. వీటిల్లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. అదేవిధంగా ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్ ఏ18తో వచ్చింది. ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ.89,900గా, ఐఫోన్ 16 ప్రొ ప్రారంభ ధర రూ.1,19,900గా, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ ప్రారంభ ధర రూ.1,44,900గా ఉన్నాయి. మరోవైపు ఐఫోన్ 16కి వస్తున్న డిమాండ్ దృష్ట్యా ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో రేపటి నుంచి బిగ్ బాస్కెట్‌లో విక్రయాలు జరపనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో డెలివరీ చేయనున్నట్లు వెల్లడించింది.