ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు.. మంత్రి తుమ్మల స్టేట్‌మెంట్ నమోదు

ప్రతిపక్షం, జూన్ 13: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్టేట్‌మెంట్‌ను పోలీసులు నమోదు చేశారు. ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు, 2023 ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలపై వివరాలు సేకరించారు.

ఎన్నికల కాలంలో తుమ్మల ఫోన్ ట్యాప్ చేసినట్లు విచారణలో గుర్తించిన పోలీసులు, దానికి సంబంధించిన అంశాలపై ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల స్టేట్‌మెంట్లను కూడా దర్యాప్తు అధికారులు నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఈ కేసు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News