ప్రతిపక్షం, జూలై 28: సోషల్ మీడియాలో ఎవరినైనా ద్వేషించడం, ట్రోల్ చేయడం సరైన పద్ధతి కాదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు సూచించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన అభిమానులతో పలు విషయాలు పంచుకున్నారు.
ఎవరైనా నచ్చకపోతే వారిని ట్రోల్ చేయకుండా వదిలేయాలని, అలాంటి విషయాల కోసం సమయం, డబ్బు వృథా చేయొద్దని అన్నారు. ఆ సమయాన్ని కుటుంబం, వ్యక్తిగత అభివృద్ధికి వినియోగించాలని అభిమానులకు హితవు పలికారు.
ఈ సందర్భంగా తన సన్నిహితుడు వాసు గురించి సరదాగా ప్రస్తావించిన అల్లు అర్జున్, తనపై అభిమానంతో పేరుకు ముందు “బన్నీ” అని పెట్టుకున్నాడని చెప్పారు. ఇప్పుడు పేరు మార్చుకుంటే సాధారణంగా కాకుండా స్టైలిష్‌గా “V-A-A-S-U” అని పెట్టుకోవాలని నవ్వుతూ వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకోగా, సోషల్ మీడియాలో ట్రోలింగ్ సంస్కృతిపై ఆయన చేసిన సూచనలు చర్చనీయాంశంగా మారాయి.

















