[t4b-ticker]

బోడంగిపర్తి గ్రామంలో పొలంబడి కార్యక్రమం – పత్తి పంట యాజమాన్యంపై రైతులకు అవగాహన

కుమ్మందానిగూడెంలో రైతులకు పొలంబడి – పత్తిలో పీల్చే పురుగుల నివారణకు కీలక సూచనలు.

పత్తి రైతులకు అలర్ట్ – ఫిప్రోనిల్ + 13:0:45 తో పిచికారీ చేయాలన్న వ్యవసాయ అధికారి.

ప్రతి పక్షం చండూరు, సెప్టెంబర్ 17: బోడంగిపర్తి గ్రామపంచాయతీ పరిధిలోని కుమ్మందానిగూడెం గ్రామంలో గురువారము ఆత్మ సౌజన్యంతో పొలంబడి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్తి పంట సమగ్ర యాజమాన్య పద్ధతులు మరియు పప్పు ధాన్యాల ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి P. మల్లేష్ మాట్లాడుతూ… పత్తి పంట విత్తనం వేసుకునే మొదలు పత్తి తీసే వరకు రైతులు చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ప్రధానంగా పత్తి పంటను నల్లరేగడి భూముల్లోనే వేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం పత్తి పంటలో పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఉన్నందున నివారణకు ఎకరానికి ఫిప్రోనిల్ 400 గ్రాములు + 13.0.45 ఒక కేజీ + అగ్రోమిన్ మాక్స్ కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు.పత్తి పంట బెట్టకు గురైతే 2 శాతం యూరియాను 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలన్నారు. పత్తిలో అంతర పంటలుగా కంది, దోస, ఇతర కూరగాయలు వేసుకోవాలని సూచించారు.రైతు సోదరులు రసాయన ఎరువులు మరియు పురుగు మందులు తక్కువ మోతాదులో వాడాలని, సేంద్రియ ఎరువులను అలవాటు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మల సుగుణమ్మ శంకర్, వ్యవసాయ విస్తరణాధికారి పి. పవన్, BTM మునుగోడు రమేష్, రైతులు V. శ్రవణ్, K. యాదయ్య, V. శంకర్, లింగయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News