Trending Now

ఖానాపూర్ నుండి హైదరాబాద్‌కు బస్సు లేక ఇబ్బందులు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11: ఆ పట్టణం పట్టణ కేంద్రంగా మారి 10 : సంవత్సరాలు పూర్తవుతున్నాయి.. అయినా అక్కడ ఆ స్థాయి ప్రాయాణ ప్రాంగణంలో సౌకర్యాలు లేకపోగా బస్సులు కూడా అడపాదడపా గానే ఆయా ప్రాంతాలకు నడుస్తున్నాయి. పట్టణంగా మారి 10 సంవత్సరాలు అవుతున్న ఖానాపూర్ నుండి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ కు రాత్రి సమయంలో ఒక బస్సు తప్ప మరో బస్సులు లేకపోవడంతో హైదరాబాద్ కు ఖానాపూర్ నుండి వెళ్లాలనుకునే వారు ప్రతిరోజు రాత్రి 9:30 గంటల వరకు వేచి చూడవలసిందే..! ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాలలో తగిన విధంగా ప్రయాణ ప్రాంగణాలు అభివృద్ధి దశలో దూసుకెళ్తుండగా ఖానాపూర్ లో మాత్రం 20 ఏళ్ల నాటి విధివిధానాలే రోడ్డు రవాణా శాఖ వారు అమలు చేస్తూ ముందుకు వెళ్తుండడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రాంతంగా మారినా ఖానాపూర్ ఈ ఎనిమిదేళ్లలో జనాభా పరంగా పట్టణ విస్తరణ పరంగా విపరీతంగా పెరిగింది. పరిసరాలలో ఉన్న మండల గ్రామీణ ప్రాంతాల వాసులు ఖానాపూర్ పట్టణానికి వచ్చేసి శాశ్వత నివాసాలు నిర్మించుకుంటూ ఉండగా ఆ తరహాలో పట్టణం ముందుకు తీసుకెళ్తుంది. పెరుగుతున్న స్థానికుల సంఖ్య ఆధారంగా బస్సు సంఖ్యలను కూడా పెంచవలసిన రోడ్డు రవాణా సంస్థ వారు ఆ స్థాయిలో చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు ఉండే ఖానాపూర్ టు హైదరాబాద్ బస్సు ప్రతిరోజు కిక్కిరేసి పోతుండడంతో అటు ప్రణీకులు ఇటు కుటుంబ సభ్యులు పడరాని పాట్లు పడుతూ రోడ్డు రవాణా సంస్థ అధికారులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గతంలో మాదిరి ఖానాపూర్ నుండి కూడా తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ కు ప్రత్యేక బస్సులు నడపాలని అయితే ఈ సమస్య తీరుతుందని వారు కోరుతున్నారు.

బస్సుల సంఖ్యను వెంటనే పెంచాలి : ముబిన్, ప్రయాణికుడు ఖానాపూర్

ఖానాపూర్ నుండి ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు ఒకే ఒక బస్సు నడుపుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో తెల్లారుజామున 5 గంటలకు ఖానాపూర్ నుండి హైదరాబాద్ కు బస్సు నడిపేవారు రోడ్డు రవాణా సంస్థ వారు. ఎందుకు ట్రిప్పును నిలిపి వేశారో అర్థం కావడం లేదు. వెంటనే రోడ్డు రవాణా సంస్థ అధికారులు గుర్తించి ప్రతిరోజు తెల్లవారుజామున గతంలో నడిపిన ఖానాపూర్ నుండి హైదరాబాద్ బస్సును పునరుద్ధరించాలని కోరుతున్నాను.

Spread the love

Related News

Latest News