అమ్మ పేరు పైన మొక్కలు నాటాలి వాటిని సంరక్షించాలి

  • బిజెపి కార్యాలయంలో మొక్కలు నాటిన ఎంపీ
  • ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన ఎంపి

ప్రతిపక్షం, జూన్ 05, మెదక్: మెదక్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరు పైన మొక్కలు నాటి వాటిని సంరక్షించి మొక్కలు వృక్షమయ్య వరకు ప్రతి ఒక్కరు దాన్ని కాపాడాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు శుక్రవారం ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బిజెపి నూతన కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు జిల్లా అధ్యక్షులు మల్లేశం గౌడ్ బిజెపి నాయకులు గడ్డం శ్రీనివాస్.రంజిత్ రెడ్డి. తదితరులు కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్లు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.ఇప్పటికే ప్రపంచం మొత్తం కాలుష్యం అయిపోయిందని ప్రతి ఒక్కరూ ఏసీలు లేకుండా బతకలేని పరిస్థితి కొనసాగుతుందని ప్లాస్టిక్ వాడకం పెరిగి క్యాన్సర్ వంటి రోగాలు రావడం జరుగుతుందని వీటిని నివారించాలంటే విరివిగా మొక్కలు నాటి రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన అన్నారు. దేశంలో క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా కావడానికి కారణం కాలుష్యం పెరిగిపోవడమేనని దీంతో ఎండలు 48 డిగ్రీలు వరకు రావడం జరుగుతుందని ఆయన తెలిపారు మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరు మీద చెట్లను నాటి వాటిని సంరక్షించి మొక్కలు అయ్యేవరకు సంరక్షించాలని తెలిపారు మెదక్ నుండి ఎల్కతుర్తి నేషనల్ హైవే 765 డి పైన ఇరువైపులా లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు రెండు మూడు వర్షాలు పడిన వెంటనే ఇట్టి కార్యక్రమానికి డేట్ ఇవ్వడం జరుగుతుందని ప్రజలు విద్యార్థులు సత్యం గా పాల్గొని మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రసాద్. సతీష్ బెండ వాణి. ఎమ్మెల్యే రెడ్డి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News