ప్రియుడితో కలిసి చనిపోదామంటూ బ్రిడ్జిపైకి.. అతడు నదిలో దూకగానే ప్రేయసి పరార్!

ప్రతిపక్షం, జూలై 17: ప్రేమలో ఉన్న ఓ జంట కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే చివరి క్షణంలో ప్రియుడిని ఒంటరిగా వదిలేసి ప్రేయసి పరారైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. ఓ ప్రేమ జంట యమునా నదిపై ఉన్న వంతెన వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి నదిలో దూకి ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ముందుగా యువకుడు నదిలోకి దూకాడు. అయితే అతడు నీటిలోకి దూకిన వెంటనే యువతి అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.

స్థానికులు విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి యువకుడిని రక్షించారు. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అసలు ఆ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు నిర్ణయించుకుంది? యువకుడు నదిలోకి దూకిన వెంటనే యువతి ఎందుకు అక్కడి నుంచి వెళ్లిపోయింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. યુવతిని గుర్తించి విచారించిన తర్వాత ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Spread the love

Related News

Latest News