Trending Now

సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు బసవేశ్వరుడు..

బసవేశ్వరుడి పథకావిష్కరణ చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: సామాజిక ఆధ్యాత్మిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన భారతీయ దార్శనికుడు, నాటి ప్రజా నాయకుడు బసవేశ్వరుడని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొరియాడారు. బసవ జయంతిని పురసరించుకొని షాద్ నగర్ వీరశైవ లింగాయత్‌లు, లింగ బలిజలు సహా స్థానిక నాయకులు పలువురు సామాజికవేత్తలు ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. బసవేశ్వరుడి సేవలు, బోధనలను స్మరించుకొన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో శ్రీ మహాత్మా బసవేశ్వర 891 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బసవేశ్వరుడి పథకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ నరేందర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అగనూరు విశ్వం వీరసేవ సమాజ అధ్యక్షుడు బస్వం అధ్యక్షుడు బొబ్బిలి ప్రవీణ్ కౌన్సిలర్లు ఈశ్వర్ రాజు ప్రతాప్ రెడ్డి, జర్నలిస్ట్ లక్కాకుల రమేష్, లక్కాకుల కిరణ్, పట్వారి శ్రావణ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. సమాజంలోని మత ఛాందసాన్ని ఖండించి, సాంఘిక దురాచారాల మీద పోరాటం చేయడమే కాకుండా, వర్ణ, కుల, లింగ వివక్ష లేని సమాజం కోసం 900 ఏండ్ల క్రితమే పోరాడిన సామాజిక దార్శనికుడు బసవేశ్వరుడు అని కొనియాడారు. ‘అనుభవ మంటపం’ వ్యవస్థను ఏర్పాటు చేసి, అన్ని కులాలకు అందులో ప్రాతినిధ్యం కల్పించి, పార్లమెంటరీ ప్రజాస్వామిక పాలనకు బీజాలు వేశారని తెలిపారు. బసవేశ్వరుని జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నదని చెప్పారు. బసవేశ్వరుని స్ఫూర్తిని రేపటి తరాలకు అందచేయాలని కోరారు. కుల మతాలకు అతీతంగా మనుషులంతా ఒకటేననే బసవేశ్వరుని సమతా తాత్వికతను కొనసాగిస్తున్నదని వెల్లడించారు. దళిత, బహుజన, గిరిజన వర్గాలు, మహిళా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ బసవేశ్వరుని ఆశయాలను కొనసాగిస్తామని శంకర్ స్పష్టం చేశారు.

Spread the love

Related News