Trending Now

‘నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే’.. రేవంత్‌పై డీకే అరుణ ఫైర్

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ అధికారంలో ఉన్నా ప్రతిపక్ష నాయకుడిలానే మాట్లాడారని.. వాళ్లపై వాళ్లకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేలా ఎవరైనా వస్తే బీజేపీ ఆలోచిస్తుందన్నారు. ‘‘ప్రధానమంత్రిని మొన్న పెద్దన్న అన్నావ్. మీ పార్టీలో విమర్శలు వస్తే.. ఇప్పుడు మోడీ కేడి అంటున్నావ్. నిన్నే ఏక్ నాత్ షిండే అని మీ పార్టీ వారు అంటున్నారు. పాలమూరు అభివృద్ధికి రేవంత్ చేసిందేమిటి.. నేను మంత్రిగా పాలమూరుకు ఎంతో చేశాను.. నన్ను విమర్శిస్తే ఆకాశంలో ఉమ్మినట్టే’’ అంటూ కామెంట్స్ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం కేంద్రం 60 శాతం నిధులు ఇస్తామని చెబుతున్నా.. జాతీయ హోదా కోసం ఎందుకు పట్టు పడుతున్నారని మండిపడ్డారు. 2014లో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డిజైన్ ఇప్పుడు ఉందా అని ప్రశ్నించారు. కాళేశ్వరంపై జ్యుడీషియరీ ఎంక్వయిరీ పేరుతో కాలయాపన చేస్తూ ఆ కాంట్రాక్టర్‌ను రక్షించేందుకు ఇప్పటి ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుందని.. చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. కేసీఆర్ ఇదే అహంకారం చూపితే ప్రజలు ఫామ్ హౌస్‌కు పంపించారని డీకే అరుణ పేర్కొన్నారు.

Spread the love