బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు న్యాయం చేయాలి

ప్రజావాణిలో ధర్నా చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూన్ 06: బెస్ట్ అవైలబుల్ స్కూల్లో సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులకు హాస్టల్. స్కూల్లో అనుమతి లేదంటే ప్రైవేట్ యజమాన్యం విద్యార్థులకు అనుమతి ఇవ్వకపోవడంతో జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ సెలెక్ట్ అయిన విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్ జిల్లాలో వంద మంది విద్యార్థులు డ్రా సిస్టం ద్వారా సెలెక్ట్ అయ్యారు అందులో.తూప్రాన్ గీత హై స్కూల్. మెదక్ గీత హై స్కూల్. సిద్ధార్థ మాడల్ హైస్కూల్లోని యజమాన్యం సెలెక్ట్ అయిన బెస్ట్ అవైలబుల్ విద్యార్థిని విద్యార్థులను. హాస్టల్ పాఠశాలలకు రానివ్వడం లేదు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వినతి పత్రం సమర్పించడం జరిగిందని వారు తెలిపారు స్కూల్లో ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న తోటి విద్యార్థులు స్కూలాలకు వెళుతున్న విద్యార్థులు వెళ్లకపోవడంతో మనస్థాపానికి గురవుతున్నారని వారు తెలిపారు ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకుని బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News