ప్రతిపక్షం, వెబ్ డెస్క్: లెబనాన్ భూభాగం నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి దాడిలో ఇజ్రాయెల్లో ఓ భారతీయుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దుల్లో ఉన్న మార్గాలియోట్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రమంపై ట్యాంకు విధ్యంసక క్షిపణి దాడి జరిగినట్లు.. ఈ దాడిలో ఒక భారతీయ జాతీయుడు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన అధికారులు తెలిపారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. ఈ ముగ్గురు భారతీయులు కేరళకు చెందిన వారని నివేదిక పేర్కొంది. మృతుడిని కేరళలోని కొల్లంకు చెందిన పట్నీబిన్ మాక్స్‌వెల్‌గా గుర్తించారు. గాయపడిన ఇద్దరు భారతీయులను బుష్ జోసెఫ్ జార్జ్, పాల్ మెల్విన్‌లుగా గుర్తించారు.