నగ్న వీడియోలు తీసి బ్లాక్ మెయిల్.. అరెస్ట్

ప్రతిపక్షం, జూన్ 29: సోషల్ మీడియా ద్వారా మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న పాత నేరస్థుడు కిలారి నాగతేజ అలియాస్ నాని (24)ని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలతో పరిచయం పెంచుకుని వారిని ఉచ్చులోకి దింపి, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల గచ్చిబౌలిలోని ఓ హోటల్‌కు యువతిని పిలిపించిన నిందితుడు, కత్తితో బెదిరించి బలవంతంగా నగ్న వీడియోలు చిత్రీకరించాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి ఒక కత్తి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసుపై మరింత దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News