Trending Now

మార్చి 12న తెలంగాణ కేబినెట్ భేటీ..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఈనెల 12వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై రిటైర్డ్​ జడ్జీతో విచారణ, అలాగే ధరణి స్థానంలో కొత్త విధానంపై చర్చ, ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పథకాలకు కేబినెట్​ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. అలాగే వచ్చే లోక్​సభ ఎన్నికల్లో మంత్రులకు ఉమ్మడి జిల్లాల బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Spread the love

Related News

Latest News