హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. ఇంతకు ముందు TS పేరుతో ఉన్న రిజిస్ట్రేషన్లను శుక్రవారం (మార్చి 15) నుంచి TG పేరుతో మార్చారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త కోడ్ రవాణా శాఖకు కాసులు కురిపించింది. కోడ్ ప్రారంభమైన తొలిరోజే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో భారీగా ఆదాయం వచ్చింది. ఫీజు, ఫ్యాన్సీ నంబర్లకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా రూ.2.51 కోట్ల ఆదాయం రాగా.. అందులో రూ.1.32 కోట్లు మూడు జిల్లాలనుంచే సమకూరడం విశేషం.
అన్ని కార్యాలయాల్లో టీజీతో పాటు 0001 కొత్త సీరిస్ ప్రారంభం కావడంతో.. ఫ్యాన్సీ నంబర్లు దక్కించుకోవడానికి కొత్తవాహనాలు కొనుగోలు చేసిన వారు ఆసక్తి చూపించారు. ఆన్‌లైన్‌లో పోటాపోటీగా బిడ్డింగ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ పరిధిలో TG 09 0001 నంబరు ఏకంగా రూ.9,61,111 ధర పలికింది. రాజీవ్ కుమార్ ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో ఈ ఫ్యాన్సీ నంబరు దక్కించుకున్నారు. రాజీవ్ ఫ్యాన్సీ నెంబర్‌కు పెట్టిన ధరతో మరో కారు కొనేయెచ్చు. ఖైరతాబాద్, టోలిచౌకి, మలక్‌పేట, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, బండ్లగూడ, తిరుమలగిరి, అత్తాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్‌లో కొత్త కోడ్‌తో అధికారులు రిజిస్ట్రేషన్లను
ఫ్యాన్సీ సిరీస్ నంబర్ల కోసం అధికారులు ఆన్‌లైన్‌లో బిడ్డింగ్ నిర్వహించగా.. విశేష స్పందన వచ్చింది. 0009, 0999 లాంటి నంబర్లను వాహనదారులు పోటీపడి మరి దక్కించుకున్నారు. ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న వాహనదారులకు మాత్రం పాత టీఎస్ కోడ్‌తోనే రిజిస్ట్రేషన్లు చేశారు. మరో 15 రోజుల వరకు పాత స్లాట్లు నడవనున్నట్లు అధికారులు తెలిపారు. కొత్తవాహనాలు కొనుగోలు చేసినవారికి మాత్రం TG కోడ్‌తో సిరీస్ కేటాయిస్తున్నారు. పాత విధానం ప్రకారమే నంబర్లకు నిర్ణీత ఫీజు ఉంటుందని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు.