Trending Now

హనుమాన్ జయంతి వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత..

జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్..

ప్రతిపక్షం, జగిత్యాల, ఏప్రిల్ 23: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు, దీక్ష పరులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని బందోబస్తు లోని పోలీసులకు సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది భక్తులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. హనుమాన్ దీక్ష తీసుకున్న దీక్షపరులు కాలినడకన కొండగట్టుకు వచ్చే సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రేడియం స్టికర్స్ ను వారి బ్యాగులకు, జెండా కు అంటించడం జరిగిందని అన్నారు.

రోడ్డుకు ఇరువైపులా నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాహనాలను గమనిస్తూ.. తమ గమ్యస్థానానికి చేరుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. అనంతరం ఆలయ పరిసరాల్లో, మాల విరమణ, క్యూలైన్ల లో, వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాటలను పరిశీలించారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ లు వినోద్ కుమార్, భీమ్ రావు, డీఎస్పీ లు రఘుచంధర్, ఉమామహేశ్వర రావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర రావు ,సీఐ రవి, ఎస్ఐ లు ఉన్నారు.

Spread the love

Related News

Latest News