Trending Now

ప్రజలు రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు..

దేవుళ్ళ మీద ఓట్లు అందుకే..

సీఎం కు లేఖ రాసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి

ప్రతిపక్షం, స్టేట్ బ్యూరో హైదరాబాద్, ఏప్రిల్ 22: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రజలు నమ్మడం లేదని, అందుకే దేవుళ్ళ మీద రేవంత్ రెడ్డి ఒట్టు వేస్తున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి విమర్శించారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ చెప్తున్నారని ఆరోపించారు. ఏ ఊరికి వెళ్లిన అక్కడి నేతకు నీవే నెక్స్ట్ సీఎం అని ఆయనతో చెప్తారని విమర్శించారు.కేసిఆర్ 20మంది టచ్ లో ఉన్నారనే మాటలు చూస్తే.. కేసీఆర్ తో కోమటిరెడ్డి వెంకటరెడ్డి టచ్ లో ఉన్నారేమో అనిపిస్తుందాన్నారు. నాకు అయితే అదే అనుమానం ఉందని అన్నారు. ప్రజలు నమ్మట్లేదని దేవుళ్ళ మీద ఒట్టు వేయడం బాధాకరమని అన్నారు. రుణమాఫీ సరే.. మిగిలిన హామీల మాటేమిటి అని ప్రశ్నించారు.మిగతా హామీల కొరకు ఎంత మంది దేవుళ్ళ మీద ఒట్టు పెడతావు..? నాలుగున్నర నెలల్లో రాష్ట్రంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నడు లేని విధంగా రైతులు గోస పడుతున్నారని చెప్పారు ఒక వైపు నీళ్లు లేక రైతులు బాధపడుతుంటే ఇంకో వైపు ధాన్యం కొనుగోలు చేయక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు.

అకాల వర్షాలతో ధాన్యం తడిచిందని వీటిని ప్రభుత్వం కొనడం లేదన్నారు.పంటకు బోనస్ ఇవ్వట్లేదని విమర్శించారు.పంటకు గిట్టుబాటు ధర, తడిసిన ధాన్యం కొనుగోలు లేదు, మీరు ప్రకటించిన బోనస్ లేదని అన్నారు రైతులకు ఇచ్చిన హామీల మీద సీఎం కు నేను లేఖ రాస్తున్నానని తెలిపారు. వ్యవసాయ రంగానికి మీరిచ్చిన హామీల ప్రకారం లక్ష కోట్లు అవసరం అని పేర్కొన్నారు. అంత బడ్జెట్ ఎక్కడి నుంచి జమ చేస్తారు? అని అన్నారు. కళ్యాణ లక్ష్మి , తులం బంగారం వస్తదని ఆడపడుచుల పెళ్ళీలు పోస్ట్ పోన్ చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులకు స్కూటి లా మాటేమైంది? అని అడిగారు. మీరు ఇచ్చిన హామీల బాగోతం చిట్టా బయట పెడతామని హెచ్చరించారు. ఇవన్నీ ఆగస్టు లోపల నెరవేరుస్తావా? లేదంటే రాజీనామా చేస్తావా..? అని ప్రశ్నించారు. రాజకీయం కోసం దేవుళ్ళ మీద ఒట్టు పెట్టీ.. దేవుళ్ళను వాడుకుంటున్నాడు ఆగస్టు వరకు రేవంత్ ఉంటాడో లేదో తెలీదని ఏద్దేవా చేశారు.

Spread the love

Related News