ప్రతిపక్షం, వెబ్ డెస్క్: జగన్ వైఎస్సార్ వారసుడు కానే కాదు అని వైఎస్ షర్మిలా సంచలన కామెంట్స్ చేశారు. మైదుకూరు నియోజక వర్గం బ్రహ్మం గారి మఠం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ పాలన కు జగన్ పాలనకు పొంతనే లేదని.. బూతద్దం పెట్టీ చూసినా వైఎస్ పాలన ఆనవాళ్లు కూడా కనపడవని.. జగన్ పాలన హత్యా రాజకీయాలు చేసే పాలన.. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్న పాలన అని వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. CBI అవినాశ్ రెడ్డిని నిందితుడని.. అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిందని.. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్, లావాదేవీలు అన్ని ఉన్నాయని చెప్పిందని.. అన్ని ఆధారాలు ఉన్నా అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడని ఆమె సంచలన కామెంట్స్ చేశారు.