ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి. ప్రముఖ జ్యువెలరీ వ్యాపారులు, బిల్డర్ల ఫోన్లను నిందితులు ట్యాప్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హవాలా వ్యక్తులను బెదిరించి ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు భారీగా డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వ్యాపారస్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. నిందితులు ఓ మాజీ మంత్రి అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరించినట్లు సమాచారం.