Manne Krishank: బీఆర్ఎస్ నేతకు మెయిన్‌ హర్డ్స్‌ సంస్థ లీగల్‌ నోటీసులు

legal notices to BRS leader Manne Krishank: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌కు మెయిన్‌ హర్డ్స్‌ సంస్థ లీగల్‌ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారంటూ ఈ నిర్ణయం తీసుకుంది. క్రిశాంక్ దురుద్దేశంతో తమ కంపెనీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆరోపణలు చేశారని ఆ నోటీసుల్లో పేర్కొంది. తమపై చేసిన ఆరోపణలను ఆయన 24 గంటల్లో వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. అలాగే ఎక్స్‌లో పెట్టిన పోస్టులను తొలగించాలని డిమాండ్‌ చేసింది. లేనిపక్షంలో సివిల్‌, క్రిమినల్‌ పరంగా న్యాయపరమైన చర్యలకు వెళ్తామని హెచ్చరించింది.

Related News

Latest News