Trending Now

ఆర్టీసీ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ సవరణ..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఉద్యోగుల ఇంటి అద్దె భత్యంను ఆర్టీసీ యాజమాన్యం సవరించింది. జీవో నంబర్‌ 53 ప్రకారం హెచ్‌ఆర్‌ఏ సవరణ చేయాలని 2020లో ఆర్టీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వం ఆదేశించింది. అప్పడు ఆర్టీసీ ఉద్యోగుల పే రివిజన్‌ చేయకపోవడంతో హెచ్‌ఆర్‌ఏ సవరణను ఆర్టీసీ తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా 2017 పే స్కేల్‌ని రివిజన్‌ చేసి ఉద్యోగులకు 21 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జీవో నంబర్ 53 ప్రకారం.. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను యాజమాన్యం నిర్ణయం తీసుకున్నది. హెచ్‌ఆర్‌ఏ సవరణపై జరుగుతున్న అసత్య ప్రచారం నేపథ్యంలో టీఎస్‌ ఆర్టీసీ యాజమాన్యం వివరణ ఇచ్చింది.

Spread the love

Related News

Latest News