ప్రతిపక్షం, జూన్ 24: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై నిర్వహించిన జూమ్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పనిచేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించే వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు.
పార్టీ కోసం పనిచేయని నాయకులు అవసరం లేదని, ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పూర్తి బాధ్యత తీసుకుని పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
పనితీరు సరిగా లేకపోతే ఇన్ఛార్జ్ బాధ్యతల్లో మార్పులు తప్పవని హెచ్చరించిన సీఎం, ఎవరు ఎంత పనిచేస్తున్నారనే నివేదిక తన వద్ద ఉందని పేర్కొన్నారు. పేర్లు బహిర్గతం చేసే పరిస్థితి రాకముందే పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు.

















