Trending Now

భారీగా గంజాయిని పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: గంజాయి ని స్మగ్లింగ్ చేస్తున్న కరడు గట్టిన ముఠాతో పాటు రు. 10,50,000/- విలువగల 30 కిలోల గంజాయిని సైబరాబాద్ SOT పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రాజేంద్రనగర్ SOT బృందం అశోక్ లే ల్యాండ్ ట్రాలీ ఆటో, FZ బైక్‌ను వాటితో ప్రయాణిస్తున్న చార్మినార్ ప్రాంతానికి చెందిన అయాన్ అలీ ఖాన్, మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులను మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని పట్టుకుని తనఖీ చేయగా.. ఆటో ట్రాలీలో లగేజీ బ్యాగులలో దాచిన 15 గంజాయి పాకెట్ల లలో 30 కేజీ ల గంజాయి లభ్యమైంది. విచారణలో ఒరిస్సా చెందిన అయాన్ దీపక్ పాటిల్ అనే గంజాయి స్మగ్లర్ నుండి 30 కేజీల గంజాయిని భద్రాచలం వద్ద కేజీ కి రూ. 5,000/- చొప్పున గంజాయిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద తనఖీలకు దొరకకుండా అతని స్నేహితుడు మొయినుద్దీన్‌ తన బైక్‌పై భద్రాచలం నుండి హైదరాబాద్ వరకు పైలేటింగ్ చేయగా.. ఎక్కడా దొరకకుండా తెల్లవారి జామున ఈ ప్రాంతానికి చేరుకున్నారు. స్మగ్లింగ్ చేసి తీసుకువచ్చిన గంజాయిని కేజీకి రు. 35,000/- చొప్పున స్థానికంగా ఉన్న చిన్న చిన్న ప్యాకెట్ లు గా మార్చి అమ్ముతున్నట్లు తెలిపారు.

Spread the love

Related News

Latest News