ప్రతిపక్షం, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య పల్లవి ఈ ఉదయం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. డాక్టర్ పల్లవిని 2020లో నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల సమక్షంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ‘కార్తికేయ2’తో జాతీయ స్థాయిలో నిఖిల్ గుర్తింపు పొందాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీ ‘స్వయంభూ’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో ఆయన వారియర్ పాత్రను పోషిస్తున్నాడు.