Trending Now

ప్రపంచంలో తొలి క్లాక్‌ని నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ..

ప్రతిపక్షం, నేషనల్: ప్రపంచంలోనే మొట్టమొదటి ‘వేద గడియారాన్ని (Vedic Clock)’ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ‘విక్రమాదిత్య వేద గడియారం’ పేరుతో సిద్ధమైన ఈ క్లాక్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభిస్తారు. పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం (కాల గణన పద్దతి) ప్రకారం ఈ గడియారం పనిచేస్తుంది. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ ఏరియాలో 85 అడుగుల ఎత్తున్న టవర్‌పై ఈ క్లాక్‌ని అమర్చారు.

Spread the love