ప్రతిపక్షం, జూన్ 30: తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆరోపించారు. మల్కాజిగిరిలో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో బలహీన వర్గాలకు ఇప్పటికీ న్యాయం జరగడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించిన నితిన్ నబీన్, తెలంగాణలో “ఆర్‌ఆర్ ట్యాక్స్” పేరుతో వసూళ్లు జరుగుతున్నాయని, ఇక్కడి నుంచి ఢిల్లీకి డబ్బులు వెళ్తున్నాయని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణలో బీజేపీకి ప్రజల ఆదరణ రోజురోజుకూ పెరుగుతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అండగా నిలుస్తారని నితిన్ నబీన్ అన్నారు.

















