Trending Now

ఎంపీ అభ్యర్థి కోసం బీఆర్ఎస్ వేట..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: ఆ పార్లమెంట్ పరిధిలో మళ్ళీ ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాలి, మళ్ళీ గెలుస్తాడు అని ఆ పార్టీ అనుకుంది. ఇక ఆ సీట్‎పై ఇబ్బంది ఏమి లేదు అని అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఆయన పార్టీ మారాడంతో ఆ పార్టీ నేతల్లో టెన్షన్ మొదలు అయింది. ఇప్పుడు ఆ పార్లమెంట్ స్థానంలో ఎవరిని పోటీకి దింపాలనే ఆలోచనలో పడిందట. ఇతంకి ఇదంతా ఏ పార్టీలో జరుగుతోంది. సడన్‎గా పార్టీ వీడిన ఆ నేత ఎవరు..? ఇప్పుడు తెలుసుకుందాం.

జహీరాబాద్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ కమలం కోసం కారు దిగేసారు. బీబీ పాటిల్ ఇలా చేస్తాడు అని బీఆర్ఎస్ నేతలు అస్సలు ఉహించలేదు. ఇదంతా పుకార్లే అని బీఆర్ఎస్ పార్టీ పెద్దగా పట్టించుకోలేదు. జహీరాబాద్ బీఆర్ఎస్ టికెట్ మళ్ళీ బీబీపాటిల్‎కే ఇవ్వాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయ్యింది. అందుకే ఈ పార్లమెంట్ స్థానాన్ని లైట్ తీసుకొని ఇతర పార్లమెంట్ స్థానాలపై దృష్టి సారించింది బీఆర్ఎస్. కానీ బీబీపాటిల్ అనూహ్యంగా బీజేపీ పార్టీలో చేరడం ఆయనకు ఆ పార్టీ జహీరాబాద్ టికెట్ ఇవ్వడం అన్ని క్షణాల్లో జరిగి పోయాయి. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ అభ్యర్థి కోసం వెతుకాలాట మొదలు పెట్టింది.

జహీరాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచారు బీబీ పాటిల్. బీఆర్ఎస్ క్యాడర్ మొత్తం ఆయన వెంటే ఉంది. మళ్ళీ టికెట్ ఇద్దాం అని అనుకునే సమయంలో ఆయన పార్టీ వీడడంతో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందన్న చర్చ జరుగుతోంది. గత కొద్దిరోజులుగా బీబీ పాటిల్ పార్టీ వీడుతారు అని వార్తలు షికార్లు కొడుతున్న బీఆర్ఎస్ పార్టీ అలెర్ట్ కాకపోవడం కూడా ఆ పార్టీకి ఇబ్బందిగానే మారిందంటున్నారు ఓ వర్గం నేతలు. ముందే ఈ విషయాన్ని గమనించి ఉంటే ఇంకో అభ్యర్థిని అక్కడ ప్రిపేర్ చేసి ఉండేవాళ్ళం అని ఆలోచనలో పండిదట బీఆర్ఎస్ అధిష్ఠానం.

బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, బలమైన అభ్యర్థులు నిలబడలేకపోవడం ఇబ్బందిగా మారింది. అయితే జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బలమైన అభ్యర్థి కోసం బీఆర్ఎస్ పార్టీ వెతుకులాట మొదలు పెట్టింది. బీబీపాటిల్ కి ధీటుగా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనలో ఉందట బీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే కొంతమంది పోటీ చేస్తాం అని వస్తున్నా ఆచితూచి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు కారు పార్టీ అధినేత. జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న మల్కాపూర్ శివకుమార్, మఠం భిక్షపతి పోటీ చేయడానికి ఆసక్తి‎గా ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వారు.

మరో వైపు పటాన్ చెరుకి చెందిన మరో నేత గాలి అనిల్ కుమార్ కూడా జహీరాబాద్ పార్లమెంట్ వైపు దృష్టి పెట్టారని సమాచారం. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గాలి అనిల్ ఇక్కడి నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈసారి జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ మున్నూరు కాపులకే ఇవ్వాలని బీఆర్ఎస్ భవన్‎లో మాజీ మంత్రి హరీష్ రావును కలిసి ఆ వర్గం నేతలు కోరారు. ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అభ్యర్థి ఎవరు అనే విషయం తెలకపోవడంతో జహీరాబాద్‎కి చెందిన బీఆర్ఎస్ క్యాడర్ కొంత ఆందోళనకు గురి అవుతుందట. కరెక్ట్ టైంకి బీబీ పాటిల్ హ్యాండ్ ఇచ్చారు అని ఎలాగైనా ఇక్కడ గెలిచి మన ప్రతాపం చూపించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారట.

Spread the love