Trending Now

‘ఉత్సవాలకు రండి’.. మాజీ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం

ప్రతిపక్షం సిద్దిపేట ఏప్రిల్ 17: సిద్దిపేట నియోజకవర్గంలోనీ కుల సంఘాలు, ఆలయాల ప్రతినిధులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కి ఆహ్వాన పత్రికలు అందజేశారు. చిన్నకోడూరు మండలం లోని గంగాపూర్ గ్రామం లో పెద్దమ్మ జాతర, చిన్న కోడూర్ మండల కేంద్రం లోని ఎల్లమ్మ దేవాలయా ఉత్సవాలకు, రాముని పట్ల రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు, రామన్న పల్లి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు, సిద్దిపేట రూరల్ మండలం రాఘవ పూర్ లోని రేణుక ఎల్లమ్మ ఉత్సవాలకు, సీతా రామచంద్ర స్వామి కళ్యానోత్సవానికి హాజరు కావాలని పత్రికలను అందజేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు కి వారు శాలువాతో సత్కరించారు.

సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబు..

సీతారాముల కల్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒక్కటి కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పెళ్లితంతు మొదలు కానుంది. ఈ వేడుకల కోసం దేవస్థానం, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఆర్టీసీ 238 ప్రత్యేక బస్సులను నడుపుతుండగా.. భద్రాద్రిలో భక్తుల రద్దీ పెరిగిపోవడంతో స్థానికంగా వసతి కష్టంగా మారింది.

Spread the love

Related News