హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ ముఠా అరెస్ట్.. రూ.12 కోట్ల గంజాయి స్వాధీనం

ప్రతిపక్షం, జూన్ 04: హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను తెలంగాణ ఈగల్ పోలీసులు ఛేదించారు. థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న సుమారు రూ.12 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న ఓ విదేశీ మహిళతో పాటు 10 మంది డ్రగ్స్ పెడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా అంతర్జాతీయ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌ను గుర్తించి గుట్టురట్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు.డ్రగ్స్ రవాణా మార్గాలు, ముఠాతో సంబంధాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Spread the love

Related News

Latest News