నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… నలుగురు మృతి

ప్రతిపక్షం, జూలై 05, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారును బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఒక ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ప్రమాద సమయంలో కారు చిట్యాల నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే చిట్యాల ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను కాపాడేందుకు వారు స్థానికులతో కలిసి వెంటనే సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Spread the love

Related News

Latest News