ఘట్‌కేసర్‌లో విషాదం.. రైలు కిందపడి దంపతుల మృతి

ప్రతిపక్షం, జూలై 03: హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్ సమీపంలో దంపతులు రైలు కిందపడి మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, పెద్ద అంబర్‌పేట్ మండలం కుంట్లూర్‌కు చెందిన రవికుమార్, శిరీష దంపతులు గురువారం రాత్రి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వరంగల్‌కు చెందిన ఈ దంపతుల మృతివార్త స్వగ్రామంలో విషాదాన్ని నింపింది. ఘటనకు గల పూర్తి కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News