Trending Now

ఈదురు గాలులకు కూలిన బ్రిడ్జి..

ప్రతిపక్షం, రామగిరి(మంథని), ఏప్రిల్ 23 : ఈదురుగాలకు పేక మేడలు కూలినట్టు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిన విస్మయ సంఘటన మంథని డివిజన్లోని మంథని ముత్తారం మండలంలో చోటు చేసుకుంది. పెద్దపెల్లి జిల్లాలోని ముత్తారం మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలాలను కలుపుతూ.. మానేరు నదిపై (ఓడేడు – గర్మిళ్లపల్లి) నిర్మాణం అవుతున్న బ్రిడ్జి సోమవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.

గత బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి-జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ.. ముత్తారం మండలం ఓడేడ్ నుంచి టేకుమట్ల మండలం గరిమిళ్లపల్లి వరకు మానేరుపై వంతెన నిర్మాణానికి రూ.47.40 కోట్లతో 2016 అగస్టులో నాటి ఆర్&బీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు శంకుస్థాపన చేయగా నేటికీ 8 సంవత్సరాలైనా వంతెన నిర్మాణం పూర్తి కాలేదు. కాగా నిర్మించిన సగం బ్రిడ్జి పనులు ఈదురుగాలికి నిలమట్టమవడం పట్ల బ్రిడ్జి నిర్మాణ పనుల నాణ్యత ఏ స్థాయిలో ఉందో అద్దం పడుతుంది. బ్రిడ్జి కూలిన విషయంలో సంబంధిత గుత్తేదారిపై విచారణ చేపట్టలాని ప్రజలు కోరుతున్నారు.

Spread the love

Related News

Latest News