BRS MLA Harish Rao: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao Comments On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి వ్యంగ్యం ఎక్కువ.. పనితనం తక్కువ అంటూ విమర్శలు చేశారు. ఖమ్మంలో 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే..వరద ప్రభావం నుంచి 9 మంది ప్రాణాలు కూడా కాపాడులేకపోయారన్నారు. భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోతే..కేసీఆర్ వెళ్లి ఢిల్లీలో దీక్ష చేయాలని, వరదలు వచ్చినందున సహాయం చేయండి అంటే..బీఆర్ఎస్ వాళ్లు విరాళాలు ఇవ్వాలని సీఎం అంటున్నారన్నారు. అన్ని మేమే చేస్తే సీఎం కుర్చీలో నువ్వు ఎందుకు అంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News

Latest News