సైబరాబాద్,ప్రతిపక్షం,నవంబర్ 01. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారని ట్రాఫిక్ ADCP (అడ్మిన్) జి. నరేందర్ తెలిపారు.
ఈ డ్రైవ్లో భాగంగా 205 మందిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.
- ద్విచక్ర వాహనాలు: 177
- ఆటోలు: 08
- కార్లు: 20
- హెవీ వాహనాలు: 00
బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) ప్రకారం:
- 36 mg/100 ml నుంచి 200 mg/100 ml మధ్య – 174 మంది
- 201 mg/100 ml నుంచి 300 mg/100 ml మధ్య – 20 మంది
- 301 mg/100 ml నుంచి 550 mg/100 ml మధ్య – 11 మంది
వీరందరినీ చట్టపరంగా కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు.
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు పునరుద్ఘాటించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే, భారతీయ న్యాయ సంహిత (BNS) – 2023లోని సెక్షన్ 105 (కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్) కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
గత వారంలో (26.10.2026 నుండి 31.10.2026 వరకు) 289 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించాయి. అందులో 26 మందికి జరిమానా, జైలు శిక్ష, 02 మందికి జరిమానా, సోషల్ సర్వీస్, 261 మందికి జరిమానా విధించబడినట్లు ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.






























