Trending Now

‘ప్రతిపక్షం’ ఎఫెక్ట్..

నిర్మల్ ఈద్గాం చౌరస్తాలో హైమాస్ట్ లైట్ల ఏర్పాటు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 29 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం చౌరస్తాలో ఏడాదికాలంగా అంధకారంగా ఉందని.. ఏడాదిగా అంధకారం నిర్మల్ ఈద్గాం చౌరస్తాలో ‘సగం వెలుగులు’ శీర్షికతో ఇటీవల ప్రతిపక్షంలో ప్రచురితమైన కథనానికి నిర్మల్ పురపాలక సంఘం అధికారులు స్పందించారు. సుమారు పది రోజుల క్రితమే హైమాస్ట్ స్తంభం పై ఉన్న చెడిపోయిన సుమారు 20 లైట్లు తొలగించారు. బుధవారం మధ్యాహ్నం సదరు హైమాస్ట్ స్తంభానికి 20 భారీ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేశారు. సుమారు ఏడాదికారంగా సదరు చౌరస్తాలో హైమాస్ట్ స్తంభం పై ఉన్న 20 భారీ ఎల్ఈడీ లైట్లు సగం వెలుగుతూ.. సగం ఆరిపోతూ స్థానికులు, వాహనాచోదకులు, పాదచారులు నిత్యం పడరాన్ని పాట్లు పడుతున్నారు. ‘ప్రతిపక్షం’ దీనిని స్పందించి కథనంగా ప్రచురించడంతో లైట్లు ఏర్పాటు చేసి నూతన వెలుగులను ఇచ్చినందుకు పలువురు ‘ప్రతిపక్షం’ దినపత్రికకు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love

Related News

Latest News