ప్రతిపక్షం, ఆగస్టు 04: క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన చిరుతిళ్లను చేర్చుకోవడం అవసరమని ఆంకాలజిస్టులు సూచిస్తున్నారు. ప్రాసెస్ చేసిన, అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే జంక్‌ఫుడ్‌కు బదులుగా పోషకాలతో నిండిన సహజ ఆహారాలను ఎంచుకోవాలని చెబుతున్నారు.
రోస్టెడ్ బీన్స్, మసాలా పల్లీలు, రోస్టెడ్ సీడ్స్, మఖానా, వేయించిన శనగలు, ఓట్స్ వంటి స్నాక్స్‌లో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరానికి మేలు చేస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. అలాగే సాధారణ చిప్స్‌కు బదులుగా తక్కువ నూనెతో తయారుచేసిన పాప్‌కార్న్‌ను తీసుకోవడం మంచి ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు.
సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు ఇలాంటి పోషకాహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

















