ప్రతిపక్షం, జూన్ 03: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ గడ్డపై నిలబడి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన విమర్శించారు.
తెలంగాణపై వివక్ష భావం ఇంకా కొన్ని వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్న ఆయన, ఇలాంటి భాషను తాము సహించబోమని అన్నారు.
తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు తెలంగాణపై మళ్లీ రాజకీయంగా కుట్రలు చేస్తున్నాయన్న అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.
ఇకపై ఆంధ్ర ప్రాంత కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఎలాంటి ప్రాజెక్టులు ఇవ్వబోమని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

















