ప్రతిపక్షం, జూలై 16: మయన్మార్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో రెండు పడవలు మునిగిపోవడంతో దాదాపు 500 మంది గల్లంతై ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
గత నెల మయన్మార్‌లోని రాఖైన్ ప్రాంతం నుంచి బయలుదేరిన రెండు పడవల్లో బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్న రోహింగ్యాలు ప్రయాణించినట్లు సమాచారం. ఒక పడవలో సుమారు 250 మంది, మరో పడవలో దాదాపు 280 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ రెండు పడవలు సముద్రంలో మునిగిపోయినట్లు సమాచారం. పడవల్లో ప్రయాణించిన వారిలో ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారు? ఎంతమంది గల్లంతయ్యారు? అనే వివరాలు స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. rescue చర్యలు, గల్లంతైన వారి వివరాలపై మరింత సమాచారం కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

















