ప్రతిపక్షం, జూన్ 09: నగరంలోని నేరేడ్మెట్ ప్రాంతంలో ఓ వివాహిత మృతి ఘటన కలకలం రేపింది. దేవనందిని (25) అనే మహిళ తన నివాసంలో ఉరివేసుకుని మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక విచారణలో ఆమె మొబైల్ ఫోన్ను పరిశీలించగా, ఆన్లైన్ రుణ సేవల ద్వారా అప్పు తీసుకున్నట్లు, చెల్లింపుల్లో జాప్యం కారణంగా పలుమార్లు వేధింపులకు గురైనట్లు సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అయితే మృతురాలి కుటుంబ సభ్యులు ఆమె మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో భర్త పాత్రపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని పోలీసులను కోరారు.
కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతూ మృతికి గల అసలు కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.

















